Breaking News

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామరెడ్డి, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్న కంపోస్ట్‌ షెడ్స్‌, పల్లె ప్రకతి వనాలు, వైకుంఠధామాలు, ఫాగింగ్‌ యంత్రాలు రైతు కల్లాలు, మంకీ ఫుడ్‌ కోర్టులు వినియోగంలోనికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్‌ ఆఫీసర్లు, మండల అభివద్ది మండల పంచాయితీ అధికారులు, ఎపిఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అదేశించారు.

బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా పల్లె ప్రగతి పనులను మండల వారిగా సమీక్షించారు. పల్లెప్రగతి పనులు పూర్తయిన తర్వాత గ్రామ సర్పంచ్‌లు క్రాస్‌ చెక్‌ చేయాలని, పనులు ప్రజల వినియోగంలోనికి వచ్చేలా చూడాలని ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆదేశించారు. అన్ని పనులకు సంబంధించి ఫోటో ఆల్బమ్‌తో ఈనెల 21 న జిల్లా స్థాయి సమీక్ష వివరాలు సమర్పించాలని తెలిపారు.

కంపోస్ట్‌ షెడ్స్‌ పూర్తయిన గ్రామాలలో సేంద్రియ ఎరువు 45 రోజులలో తయారవుతున్నందున గ్రామ పంచాయతీ పూర్తి వివరాలు నమోదు చేయాలని, సేంద్రియ ఎరువుతో గ్రామ పంచాయితీలు సంపద కేంద్రాలుగా మారుతున్నాయని, ఆదాయ వివరాలను నమోదు చేయాలని తెలిపారు. కంపోస్ట్‌ షెడ్స్‌ పూర్తి కాని గ్రామాలలో ఈ నెల 20 లోగా పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని తెలిపారు. పల్లె పకతి వనాలు పెద్ద మొక్కలతో చిట్టడవిలాగా ఉండాలని, నడక దారిలో మొరంతో రోలింగ్‌ చేయించాలని, బెంచీలు, ఫెన్సింగ్‌, గేటు, తాళం ఏర్పాటు చేయాలని గ్రామంలో ఒకరిని దానికి బాధ్యత వహించేలా ఏర్పాటు చేయాలని, పార్కు తెరిచి, మూసే సమయాలను బోర్డు రూపంలో దర్శించాలని, గ్రామ సర్పంచ్‌, గ్రామ పంచాయితీ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రాపర్‌ మెయింటెనెన్స్‌ వుండేలా చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయితీల పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌ ప్రతి నెలా మంజూరవుతున్నందున పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఉపాధి హామీ పనుల ద్వారా వైకుంఠధామం పనులు ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని, పనులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఎఓ జనరేట్‌ పనులు ఎపిఓ, ఇంజనీరింగ్‌ సిబ్బంది ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్పెషల్‌ ఆఫీసర్లు ఎపిఓలతో సర్పంచ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వాటిని ఈ నెల 20 లోగా ఆన్‌లైన్‌ నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయితీలలో ఫాగింగ్‌ మిషన్‌ కొనుగోలు ప్రక్రియ సంబంధించి నాణ్యమైన మిషన్‌ను కొనుగోలు చేయాలని, జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాటి వివరాలను, వాటి పనితీరు, నాణ్యతపై నివేదిక అందించాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు.

ఫాగింగ్‌ యంత్రాలను వారానికి రెండు సార్లు తప్పనిసరిగా వినియోగించాలని, సీజనల్‌ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎపిఓలను ఆదేశించారు. పూర్తయిన మంకీ ఫుడ్‌ కోర్టులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, పూర్తి కాని గ్రామాలలో ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని తెలిపారు. రోడ్‌ సైడ్‌ ప్లాంటేషన్‌ సంబంధించి రాబోయే ఐదు రోజుల్లో ముళ్ల పొదలు తొలగింపు, పాదులు ఏర్పాటు చేయడం, రక్షణ చర్యలు ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని తెలిపారు. జాబ్‌ కార్డులు పెంచే పనులను వేగంగా పూర్తి చేయాలని, రైతు కల్లాలు ఈనెల 20 లోగా పూర్తి చేయాలని, టెక్నికల్‌ అసిస్టెంట్లు వారి టార్గెట్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎఫ్టిఓ జనరేట్‌ చేయాలని, ఎపిడి, జిల్లా స్పెషల్‌ ఆఫీసర్లు సమీక్షించాలని తెలిపారు.

వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపిడిఓలు క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని, మిగిలిపోయిన పనులను త్వరితగతిన చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొక్కల సంరక్షణ సంబంధించి లేబర్‌ను నియమించుకోవాలని, వాచర్ల నియామకంతో ప్రతి మొక్క రక్షించబడేలా, అవసరమైన చోట రీప్లేస్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని, వంద రోజులు పూర్తయి జాబ్‌ కార్డులు రానివారికి పనులు కల్పించాలని, వంద శాతం మొక్కల రక్షణ, ఏపీ జనరేట్‌, మస్టర్‌ రికార్డులు నిర్వహించాలని, వంద శాతం ప్లాంటేషన్‌ పేమెంట్‌ జరగాలని, 2021 సంవత్సరానికి మొక్కల పెంపకం యాక్షన్‌ ప్లాన్‌ ఈ నెల 20 లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

స్పెషల్‌ ఆఫీసర్లు క్లస్టర్ల ప్రకారం గ్రామ పంచాయితీ సెక్రటరీలతో సమీక్షించి ఎన్ని పనులు కావాలో గుర్తించాలని, 20 శాతం పైగా కూలీల నమోదు చేయాలని తెలిపారు. మండల అధికారులు తమకు కేటాయించిన క్లస్టర్లలో పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరువయ్యేలా గ్రామ స్థాయిలో పల్లె ప్రగతి పనులను నిర్వహించాలని ఆదేశించారు.

కోవిద్‌ నియంత్రణలో భాగంగా జిల్లాలో మహిళా సంఘాల ద్వారా తయారు కాబడి పంపిణీ చేయబడిన మాస్కుల పేమెంట్లు చెల్లించని మండలాలలో ఈనెల 20 లోగా పేమెంట్స్‌ జరగాలని, మండల పంచాయతీ అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సిఇఓ చందర్‌ నాయక్‌, జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి నరేశ్‌, స్పెషల్‌ ఆఫీసర్లు అంబాజీ, శాయన్న, ఎపిడిలు శాయన్న, అశోక్‌, డివిజనల్‌ పంచాయితీ ఆధికారులు డిపిఎంలు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article