కామారెడ్డి, సెప్టెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో విద్యార్థులకు రోజు టివిలో వస్తున్న దశ్య మాధ్యమ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీవీలో వస్తున్న టీ షాట్ విద్య దూరదర్శన్ యాదగిరి సప్తగిరిలల్లో వచ్చే తరగతులను విద్యార్థులు చూస్తున్నారా లేదా అనే విషయాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు.
ఉదయం 10:30 గంటలకు పదవ తరగతికి సంబంధించిన విద్యార్థులు టివిలో వస్తున్న తరగతుల విషయాలను విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. దీనికి సంబందించి విద్యార్థులు రాస్తున్న నోట్స్ వర్క్ షీట్లను పరిశీలించారు.
విద్యార్థులను ప్రశ్నలు అడగగా వారిచ్చిన సమాధానాలకు సంతప్తి చెందారు. ఆన్ లైన్ తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయుల పనితీరు బాగుందన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి గంగా కిషన్, బిక్నూర్ మండల విద్యాశాఖాధికారి ఎల్లయ్య, జంగంపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబాద్రి, సిఅర్పి పాఠశాల ఉపాధ్యాయులు రాజేష్, కిషన్, లింగం, గఫుర్ శిక్షక్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021