Breaking News

24 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాలు నిండినవారు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల కోరిక మేరకు ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

18 సంవత్సరాలు నిండి ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన వారు, చదువు మధ్యలో ఆపేసిన వారు, గృహిణిలు, తదితరులు డిగ్రీ చదువుకోవడానికి ఆన్‌లైన్‌లో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఈనెల 24వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929612 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా ...

Comment on the article