Breaking News

నిజాంసాగర్‌లోకి భారీగా వరద నీరు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోకి వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 4 వేల 323 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు.

ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా కల్హేర్‌, బాచపల్లి, రాంరెడ్డిపేట్‌, నిజాంపేట్‌, శంకరంపేట్‌ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా చేరుతుందన్నారు. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతమైన సింగుర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోకి కురుస్తున్న భారీ వర్షాలకు 15 వేల 74 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. సింగూర్‌ ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్ర, ప్రాంతాలలో కురిసిన వర్షాలకు సింగూర్‌ జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోందన్నారు.

సింగూర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల కాగా 515.500 మీటర్ల నీరు నిల్వ ఉందని 29.917 టిఎంసిలకు 4.618 టిఎంసిల నీరు నిల్వ ఉందన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలో 1405.00 అడుగులు కాగా 1386.92 అడుగుల నీరు నిల్వ ఉందని, 17.802 టీఎంసీలకు 2.928 టీఎంసిల నీరు నిల్వ ఉందని డీఈఈ తెలిపారు.

Check Also

28 మందికి కరోనా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దూంపూర్‌ గ్రామంలో కరోన పరీక్షలు నిర్వహించినట్టు ...

Comment on the article