Breaking News

తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర లోని తూర్పు ప్రాంతాలలో భారీ వర్షాలు పడి జైక్వాడి మరియు ఇతర అనుబంధ ప్రాజెక్టులకు భారీగా వరద జలాలు వస్తుండటం వల్ల మిగులు జలాలను గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నట్లు మహారాష్ట్ర అధికారులు తెలియజేశారని కనుక నిజామాబాద్‌ జిల్లాలోని గోదావరి నదీ తీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు నదిలోకి వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు.

అలాగే గోదావరి నది ప్రవహిస్తున్న మండలాల రెవిన్యూ అధికారులను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టడానికి సర్వం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article