కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం మహ్మదాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో కరోనా వ్యాధి సోకిన వారికి అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రేవతి శ్రీనివాస్ చేతుల మీదుగా సి విటమిన్ సంబంధించిన పండ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, ...
Read More »Daily Archives: September 17, 2020
సింగూర్‌లోకి 61,232 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం 4 వేల 460 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా బాచపల్లి ,రాంరెడ్డిపేట్, నిజాంపేట్, శంకరంపేట్, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన సింగూరు ప్రాజెక్టు జలాశయంలోనికి కురుస్తున్న భారీ వర్షాలకు 61 వేల 232 క్యూసెక్కుల వరద ...
Read More »తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి ఆద్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ఔషద దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ఔషద దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ 19 ఔషదాలు, యాంటి బయోటిక్స్, ఇతర మందుల ధరలు, వాటి నిలువలు, నాణ్యత పరిశీలించారు. మందుల కొనుగోలు, అమ్మకం బిల్లులు పరిశీలించారు. ప్రతి మెడికల్ షాపు మందుల చట్టం నిబందనలు పాటించాలని, ఎక్స్‌పయిరీ మందులను ...
Read More »పంటలకు రోగాలు వస్తున్నాయి
నిజాంసాగర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని కొమలాంచ గ్రామ శివారులో సాగువుతున్న వరి పంటలను ఏవో అమర్ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట పొలాలపై ఎండు తెగులు, అగ్గి తెగులు, ఉల్లికోడు, బ్యాక్టీరియా రోగాలు వస్తున్నాయని రాకుండా ఉండేందుకోసం సకాలంలో రైతులు మందులు పిచికారి చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు పిచికారి చేయడంతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈవో వెంట ఏఈవో మధుసూదన్, విఆర్ఏ సాదుల ప్రవీణ్ కుమార్, ...
Read More »ఘనంగా విశ్వకర్మ జయంతి
నిజాంసాగర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కాంతం, ఉపాధ్యక్షులు రాములు, కోశాధికారి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పండరి, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శులు రమేష్, ప్రవీణ్, సలహాదారులు లక్ష్మయ్య, ఉషయ్య, చిన్న విఠల్, నారాయణ, కార్యవర్గ సభ్యులు అంజయ్య, కాశీరాం, బాలకిష్టయ్య, గంగాధర్, చిన్న రాముడు తదితరులు ఉన్నారు.
Read More »మరిచిపోతే ఊరుకునేది లేదు…
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారంపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో గురువారం సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎన్ని మొక్కలు పెట్టగలుగుతామో అన్ని పెట్టాలని, వాటిని సంరక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, మొక్కలు పెట్టడం మరచి పోయామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, ఏం తేడా వచ్చినా సంబంధిత అధికారిపై 100 శాతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెట్టిన ప్రతి మొక్క బ్రతకాలని, ...
Read More »ఎంఐఎం మెప్పు కోసమే…
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జాతీయ జండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా తెలంగాణ ప్రాంతం నిజాం ఆధీనంలోనే ఉండిపోయిందని, రజాకార్ల ఆగడాలను తట్టుకోలేక ఎంతో మంది సాయుధ పోరాటం చేశారని, సర్ధార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కారణంగా సెప్టెంబర్ 17, ...
Read More »అధికారులందరిని కలుసుకునేందుకు వీలుగా కలెక్టరేట్
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బైపాస్ రోడ్డు దుబ్బలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేటు కాంప్లెక్స్‌ను గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వచ్చే దసరాకు ప్రారంభించుకోవాలనే విధంగా పనులు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మన జిల్లా మంత్రి ఆర్అండ్బి శాఖ మంత్రి శాఖ తరపున నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ప్రత్యేకంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఒక మోడల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ...
Read More »ప్లాస్మా దానం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండలం మోతే గ్రామానికి చెందిన బాల్ రెడ్డి అనే 57 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి హైదరాబాదులోని సజన వైద్యశాలలో ఏ పాజిటివ్ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నాగరాజు సహకారంతో ఏ పాజిటివ్ ప్లాస్మాను హైదరాబాద్‌కు వెళ్లి అందజేసి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో 250 ...
Read More »గత పాలకులు ప్రకటించకపోవడం శోచనీయం
ఆర్మూర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ 18, 19 వ వార్డు ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. 19వ వార్డు ఇంచార్జ్ గటడి నితిన్ కుమార్, 18వ వార్డులో బూత్ అధ్యక్షులు సంతోష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా పుప్పాల శివరాజ్ కుమార్, గడ్డం శంకర్ హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా ప్రకటించాలని గత ఎన్నో సంవత్సరాలనుంచి ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ పాలకులు తల ...
Read More »గత చరిత్ర చెప్పాల్సిన బాధ్యత ఉంది
బోధన్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బోధన్ 22 వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా భూత్ అధ్యక్షులు, బిజెపి మాజీ కౌన్సిలర్ రామరాజు మాట్లాడుతూ ఇది స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం చేసిన పోరాటమని, బాషా, సంస్కతి, సాహిత్యాల పరిరక్షణకు చేసిన పోరాటమని పేర్కొన్నారు. రెండు వందలేళ్ళ బానిసత్వ సంకెళ్లను తెంచుకోవాలని చేసిన పోరాటమని, చరిత్రను వక్రీకరించకూడదన్నారు. రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 15 ఆగష్టు 1947, ...
Read More »తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు
బీర్కూర్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నస్రులాబాద్ మండలంలో నెమ్లి, దుర్కి గ్రామాల్లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో మిలిటెంట్ గ్రూప్ (నిజాం అనఫిషయల్ సైన్యం) రజాకార్ల పేరుతో చెలామణి అయ్యేదని, రజాకార్లు ఎంతటి రాక్షసులు అంటే (ఈ రోజుల్లో మన ఊహకు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పన్నులు ఉండేవి) పన్నులు చెల్లించని వారి గోర్ల కింద ...
Read More »