Breaking News

అధికారులందరిని కలుసుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైపాస్‌ రోడ్డు దుబ్బలోని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేటు కాంప్లెక్స్‌ను గురువారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ వచ్చే దసరాకు ప్రారంభించుకోవాలనే విధంగా పనులు చేస్తున్నామని తెలిపారు.

ముఖ్యంగా మన జిల్లా మంత్రి ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి శాఖ తరపున నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ప్రత్యేకంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఒక మోడల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం 25 ఎకరాలలో లాన్‌, సివిల్‌ వర్క్స్‌, ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్‌, మొత్తం వర్క్‌ దసరా లోపు పూర్తి చేసి దసరాకు ప్రారంభించే విధంగా ముందుకు సాగుతున్నామని, జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టరేట్‌కు షిఫ్ట్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎవరైనా జిల్లా కేంద్రానికి పనిమీద వస్తే ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో జిల్లాకు సంబంధించిన అందరు అధికారులను కలుసుకొనేందుకు వీలుగా కలెక్టరేట్‌ ఉంటుందని, వచ్చిన ప్రజలకు కూర్చోవటానికి, త్రాగటానికి నీళ్లు, టాయిలెట్స్‌ అన్నీ ఉండే విధంగా, ప్రజలకు అనుకూలంగా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రభుత్వం నిర్మిస్తుందని, మెయిన్‌ రోడ్డుకు పక్కనే ఉన్నందున ప్రజలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. పర్యటనలో ఆర్‌అండ్‌బి ఎస్‌సి రాజేశ్వర్‌ రెడ్డి, ఆర్డిఓ రవి, తహసీల్దార్‌ సంతోష్‌ కుమార్‌, ఎస్‌సి ఎలక్ట్రిసిటీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article