Breaking News

సి విటమిన్‌ పండ్ల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా బిబిపేట్‌ మండలం మహ్మదాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో కరోనా వ్యాధి సోకిన వారికి అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ రేవతి శ్రీనివాస్‌ చేతుల మీదుగా సి విటమిన్‌ సంబంధించిన పండ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని, తద్వారా కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రతినిధులను సర్పంచ్‌ రేవతి శ్రీనివాస్‌ అభినందించారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మోతే లావణ్య, కామారెడ్డి పట్టణ అధ్యక్షురాలు మెట్టు భారతి, ప్రతినిధులు మొహమ్మద్‌ అజాము, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు చింతకుంట రామ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article