Breaking News

తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆద్వర్యంలో డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రవీణ్‌ ఔషద దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ఔషద దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు.

కోవిడ్‌ 19 ఔషదాలు, యాంటి బయోటిక్స్‌, ఇతర మందుల ధరలు, వాటి నిలువలు, నాణ్యత పరిశీలించారు. మందుల కొనుగోలు, అమ్మకం బిల్లులు పరిశీలించారు. ప్రతి మెడికల్‌ షాపు మందుల చట్టం నిబందనలు పాటించాలని, ఎక్స్‌పయిరీ మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని, తప్పనిసరిగా కొనుగోలు బిల్లులు రోగులకు ఇవ్వాలన్నారు.

గతంలో తనిఖీలు నిర్వహించిన మెడికల్‌ షాపులపై డ్రగ్స్‌ అండ్‌ కెమిస్ట్‌ యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలాంటి ఔషద ఫిర్యాదుల కోసమైనా 8333925841, లేదా 8333925846 లేదా 8333925852 నెంబర్లలో సంప్రదించవ్చన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article