Breaking News

ఎంఐఎం మెప్పు కోసమే…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జాతీయ జండా ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ తెలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారత దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా తెలంగాణ ప్రాంతం నిజాం ఆధీనంలోనే ఉండిపోయిందని, రజాకార్ల ఆగడాలను తట్టుకోలేక ఎంతో మంది సాయుధ పోరాటం చేశారని, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సైనిక చర్య కారణంగా సెప్టెంబర్‌ 17, 1948 న తెలంగాణ ప్రజలకు రజాకార్ల పాలన నుండి విమోచనం కలిగిందన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రపంచంలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోలేని ఒకే ఒక ప్రాంతం తెలంగాణ అని నినదించిన కెసిఆర్‌ ఇప్పుడు ఎంఐఎం మెప్పు కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article