Breaking News

మరిచిపోతే ఊరుకునేది లేదు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంపై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో గురువారం సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇన్స్టిట్యూషన్‌లో ఎన్ని మొక్కలు పెట్టగలుగుతామో అన్ని పెట్టాలని, వాటిని సంరక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, మొక్కలు పెట్టడం మరచి పోయామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, ఏం తేడా వచ్చినా సంబంధిత అధికారిపై 100 శాతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

పెట్టిన ప్రతి మొక్క బ్రతకాలని, మొక్కలు లేకుండా ఏ ఇన్స్టిట్యూషన్‌ ఉండకూడదని ఏవెన్యూ ప్లాంటేషన్లో రోడ్డుకు 5 మీటర్లకు ఒక మొక్క చొప్పున నాటితే ఇరువైపుల 400 మొక్కలు పెట్టొచ్చన్నారు. డిపార్ట్‌మెంట్‌ వారిగా స్ప్రెడ్‌ షీట్‌ ఉండాలని, ఫీల్డ్‌ పైన ఉన్న మొక్కలు స్ప్రెడ్‌ షీట్లో నమోదు చేయాలని, అంగన్‌వాడి, ప్రైమరీ స్కూల్‌, గ్రామపంచాయతీ, సబ్‌ సెంటర్‌ ఏది మిస్‌ అవ్వకుండా అనువైన ప్రతి చోటా మొక్కలు నాటాలన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article