Breaking News

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న పంట వివరాలను, ఇళ్ల వివరాలను, రోడ్ల వివరాలను అధికారులు సేకరించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. శుక్రవారం బిచ్కుంద మండలం కుర్ల, సెట్టూర్‌ గ్రామాలలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, పెసర పంటలు జిల్లా కలెక్టర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంతు షిండేతో కలిసి పరిశీలించారు.

అనంతరం బిచ్కుంద మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులు, ఇళ్లు దెబ్బతిన్న వివరాలను తహశీల్దార్లు, ధ్వంసమైన రోడ్ల వివరాలను పంచాయితీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ షిండే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి ఎనలేని కషి చేస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఆర్థిక, మనోబలం పెంపొందించారని అన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటల వివరాలను అధికారులు త్వరితగతిన సేకరించాలని, ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలని సూచించారు.

అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం, హస్టల్‌ గ్రామ రైతు వేదిక భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌, శాసనసభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ రాజాగౌడ్‌, ఎంపిపి అశోక్‌, రెవిన్యూ, వ్యవసాయ, పంచాయతీ రాజ్‌ రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌కు పొంచి ఉన్న ప్రమాదం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిడతల‌ దండు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన నిజామాబాద్‌, నిర్మల్‌, ...

Comment on the article