Breaking News

త్వరగా పూర్తిచేయాలి… మళ్ళీ వస్తా…

సిరికొండ, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం గడ్కోల్‌, సిరికొండ గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెలాఖరు నాటికి రైతు వేదికలు ప్రారంభించు కోవాలని, పని ఫాస్ట్‌గా జరగాలన్నారు. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకతి వనాలు, హరితహారం పనులు పరిశీలించారు. గడ్కుల్‌ వైకుంఠ దామంలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడ్కుల్‌లో వైకుంఠధామం బాగుందని సర్పంచ్‌ని అభినందించారు. విలేజ్‌ పార్కు, రైతు వేదిక త్వరగా పూర్తి చేయాలని, మళ్లీ వస్తానన్నారు. సిరికొండ వైకుంఠ ధామంలో నీరు రావడం గమనించి, నది నాలా సరి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విలేజ్‌ పార్క్‌ హద్దులు ఏర్పాటు చేయాల్సిందిగా సర్వే అధికారులను ఆదేశించారు. విలేజ్‌ పార్కులో మొక్కలు నాటారు. అక్కడ నిలువ ఉన్న డ్రైనేజీ వాటర్‌ వెళ్లే విధంగా డ్రైయిన్‌ సిస్టం ప్లాన్‌ చేసుకోవాలన్నారు కార్యక్రమంలో సర్పంచ్‌లు భగవంతు రెడ్డి, దేవా గౌడ్‌, ఎంపీపీ సంగీత, రైతు సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, ఎంపిటిసి తలారి గంగారాం, ఎంపీడీవో లక్ష్మణ్‌, ఎమ్మార్వో అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comment on the article