Breaking News

25 వరకు యాక్షన్‌ ప్లాన్‌ ఇవ్వాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కిచెన్‌ గార్డెన్‌కు ల్యాండ్‌ ఐడెంటిఫై చేసి, ఏరియా లెవలింగ్‌కు యాక్షన్‌ ప్లాన్‌ ఈనెల 25 తేదీ వరకు ఇవ్వాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో అడిషనల్‌ కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. అంగన్‌వాడి సెంటర్లలో ప్రైమరీ స్కూల్స్‌, హైస్కూల్లో కిచెన్‌ గార్డెన్‌ స్థలం ఐడెంటిఫై చేసి ప్లాంటేషన్‌ తర్వాత వాటి మెయింటెనెన్స్‌ పిఈటి మరియు కుక్కర్‌ చూసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

కిచెన్‌ గార్డెన్‌ ప్లాంటేషన్‌ సంబంధించి టెక్నికల్‌ గైడెన్స్‌ ట్రైనింగ్‌ హార్టికల్చర్‌ అధికారులు ఇస్తారని, మండల్‌ హెడ్‌ క్వార్టర్‌లలో మేజర్‌ గ్రామ పంచాయతీలలో సర్పంచుల ద్వారా ఏర్పాటు చేసే విధంగా చూడాలని, క్లస్టర్‌ లెవెల్‌లో ఒక మండలాన్ని సెలక్షన్‌ చేసుకుని ట్రైనింగ్‌ ఇవ్వాలన్నారు.

ప్రతి అంగన్‌వాడి టీచర్‌కు కిచెన్‌ గార్డెన్‌పై అవగాహన ఉండాలన్నారు. అన్ని అంగన్‌వాడి సెంటర్లలో కిచెన్‌ గార్డెన్‌ డెవలప్‌ చేయాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో స్థలం ఐడెంటిఫై చేయాలన్నారు. సెల్‌ కాన్ఫరెన్సులో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article