Breaking News

ప్రపంచం ముందు తలెత్తుకుని బ్రతకాలన్న ఉద్దేశంతోనే ….

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెండోరా మండలం సావేల్‌ గ్రామంలో బిటి రోడ్డు పనులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. శనివారం సావేల్‌ గ్రామంలో 2 కోట్ల 76 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు.

2 కోట్ల 76 లక్షల రూపాయలతో పుష్కర ఘాట్‌ నుంచి మెండోరా మండల కేంద్రం వరకు ప్రధాన మంత్రి సడక్‌ యోజన స్కీమ్‌ కింద మంజూరు చేసుకున్నామని, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన గ్రామం నా సొంత గ్రామమని, ఆ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యులేనని, గ్రామానికి ఏ లోటు రానీయనని మనవి చేస్తున్నానన్నారు. కెసిఆర్‌ నాయకత్వంలో పని చేస్తున్న ప్రభుత్వం కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రపంచం ముందు తలెత్తుకుని బ్రతకాలన్న ఉద్దేశ్యంతో కెసిఆర్‌ అభివద్ధి పథంలో తీసుకెళ్తున్నారని, కేవలం ఐదు సంవత్సరాలలో చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఎదిగామని, సంక్షేమం విషయంలో, పెన్షన్ల విషయంలో 14 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.

రైతులకు కరెంటు 24 గంటలు 22 వేల కోట్లు ఖర్చు చేసి ఇస్తున్నామన్నారు. రైతులకు ఎకరాకు 5 వేలు చొప్పున రెండు పంటలకు పదివేల రూపాయలు రైతుబంధు ఇస్తున్నామని, పెద్ద వాగుపైన 12 చెక్‌ డ్యాములు కట్టుకున్నామని, ఇంకా 13 మంజూరు చేసుకున్నామని, మొత్తం 23 చెక్‌ డ్యాములు నిర్మించు కుంటామన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ లావణ్య లింగన్న, ఎంపీపీ అధ్యక్షులు సుకన్య, మెండోరా సర్పంచ్‌ లక్ష్మీ రాజారెడ్డి, జిల్లా సహకార బ్యాంక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ రెడ్డి, రమేష్‌ రెడ్డి మార్కెటింగ్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి, జడ్పిటిసి గంగాధర్‌, ఎంపిటిసి రాజు, ఎంపిటిసి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దళితుల‌ అణిచివేతపై నిరసన గళం

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ...

Comment on the article