Breaking News

Daily Archives: September 20, 2020

పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉందని, వర్షాల వలన వరదలు సంభవించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చెట్లు, ఎలక్ట్రిక్‌ పోల్స్‌, పడిపోవడం వలన సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుందని, ...

Read More »

ప్రాధాన్యతా క్రమంలో ముందుకు పోతున్నాం…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థలో కావచ్చు, గ్రామాలలో, పట్టణాలలో కావచ్చు, బడుగు బలహీన సమాజంలో కావచ్చు వర్గాల వారీగా, పనుల వారిగా విభజించుకొని ప్రాధాన్యతా క్రమంలో గత ఐదు సంవత్సరాల నుంచి ముందుకు పోతున్న సంగతి మనందరికీ తెలుసని, ఈ రోజు తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేక సర్వేలతో తేల్చి బహిరంగంగా చెప్పడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గ హనిర్మాణ ...

Read More »

వ్యవసాయ బిల్లు రైతాంగానికి నష్ట కరమైంది

బోధన్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ బిల్లు దేశ రైతాంగానికి పూర్తిగా నష్ట పరుస్తోందని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి.మల్లేష్‌ అన్నారు. ఆదివారం బోధన్‌ పట్టణంలోని పాన్‌ గల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ రైతాంగాన్ని దెబ్బ తీసి, కార్పొరేటు వ్యాపారులకు కట్టబెట్టే విధంగా కేంద్రం ఆమోదించిన బిల్లు వున్నదన్నారు. ఈ నెల 10 నుండి దేశ వ్యాప్తంగా రైతాంగం ...

Read More »

బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి 70వ జన్మదినం సందర్భంగా జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపుమేరకు సేవా సప్తాహ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇందూరు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో బస్వ గార్డెన్‌ మరియు శ్రీరామ గార్డెన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.

Read More »

మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో ఎండ్రియాల్‌ గ్రామానికి చెందిన వినోద్‌ మరియు కామారెడ్డికి చెందిన విజయ్‌ గౌడ్‌ సకాలంలో స్పందించి వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏ పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలు మాట్లాడుతూ గత ...

Read More »