Breaking News

మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో ఎండ్రియాల్‌ గ్రామానికి చెందిన వినోద్‌ మరియు కామారెడ్డికి చెందిన విజయ్‌ గౌడ్‌ సకాలంలో స్పందించి వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏ పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తం అందజేయడం జరిగిందని యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, కరోన నుండి కోలుకున్నవారు వారు 28 రోజుల తర్వాత ప్లాస్మా దానం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ రెడ్డి, టెక్నీషియన్‌ చందన్‌ ఉన్నారు.

Check Also

నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌కి గోల్డ్‌ మెడల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహదయుడు, సజ్జనుడు, స్నేహశీలి, గాయకుడు, సంగీతాభిమాని, మదుభాషి అన్నిటికీ ...

Comment on the article