Breaking News

పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉందని, వర్షాల వలన వరదలు సంభవించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

చెట్లు, ఎలక్ట్రిక్‌ పోల్స్‌, పడిపోవడం వలన సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుందని, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు, కాజివేలలో నీరు ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్‌ అంతరాయాలు, ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండి . ఇంతకు ముందే జారీ చేసిన ఫ్లడ్‌ ప్రోటోకాల్‌ తప్పని సరిగా ఫాలో కావాలని జిల్లా కలెక్టర్లను కోరింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ విషయంమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను, ఎస్‌.పి.లను అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులను ఎప్పడికప్పుడు గమనించాలన్నారు. అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Check Also

రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య పురస్కారం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ...

Comment on the article