Breaking News

వ్యవసాయ బిల్లు రైతాంగానికి నష్ట కరమైంది

బోధన్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ బిల్లు దేశ రైతాంగానికి పూర్తిగా నష్ట పరుస్తోందని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి.మల్లేష్‌ అన్నారు. ఆదివారం బోధన్‌ పట్టణంలోని పాన్‌ గల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ రైతాంగాన్ని దెబ్బ తీసి, కార్పొరేటు వ్యాపారులకు కట్టబెట్టే విధంగా కేంద్రం ఆమోదించిన బిల్లు వున్నదన్నారు.

ఈ నెల 10 నుండి దేశ వ్యాప్తంగా రైతాంగం ఆందోళనలు చేస్తున్నప్పటికి, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో రైతాంగాం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారని, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కేంద్ర వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఆమోదించిందని అయినప్పటికి మోదీ ప్రభుత్వం మొండిగా బిల్లులు పాస్‌ చేశారని దుయ్యబట్టారు.

బీజేపీ నాయకులది ద్వంద వైఖరి

నేడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, కాని మక్కలకు (మొక్కజొన్న) రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వార కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని, దేశంలో పుష్కలంగా మక్క పంటను సాగు చేయగా, కేంద్రం కోటి టన్నులకు దిగుమతికి అనుమతి ఇవ్వటం ఎంటని, 50 శాతం సుంకాన్ని 15 శాతానికి తగ్గించటం ఏంటని, 35 శాతం సుంకాలను ఎవరి ప్రయోజనాల కోసం తగ్గించారని ప్రశ్నించారు.

ఈ విషయం లో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని రాష్ట్రంలో ఒక తీరు కేంద్రంలో యింకో తీరుగా వ్యవహరిస్తున్నారని, దేశ రైతాంగాం కోసం పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమం చేయాలని మల్లేష్‌ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పడాల శంకర్‌, ఎంబెల్లి గంగారాం, ఎం.లింగప్ప, ఎం.సాయులు, బి.శంకర్‌, పి.శివకుమార్‌, డి.పొశెట్టి, బి.సాయులు, కె.లక్ష్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

గర్భిణీల‌కు శ్రీమంతం కానుకలు

బోధన్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బోధన్‌ మండలం మూడు క్లస్టర్‌లోని అంగన్‌వాడి సెంటర్‌లో ...

Comment on the article