Breaking News

ఫోన్‌ ఇన్‌లో 22 ఫిర్యాదులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేటులో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో 22 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, తీసుకున్న చర్యలపై రిపోర్టు సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ శాఖ 8, జిల్లా గ్రామీణాభివద్ధి 3, సివిల్‌ సప్లయ్‌ 2 వ్యవసాయం, విద్య, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖ, కామారెడ్డి మున్సిపాలిటీ ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు రావడం జరిగింది. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article