Breaking News

మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

బోధన్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని 12 వ వార్డ్‌ గాంధీ నగర్‌లో నివసిస్తున్న కొన్ని ఇండ్లకు వెళ్లడానికి రోడ్డు లేదని, వీధి దీపాలు లేవని, రాత్రి వేళల్లో చీకటిలో ఏమి వున్నది, లేనిది కనపడదని అంధకారంలో వుంటున్నారని, వారి ఇండ్లకు పోయే రోడ్డుపై పశువుల చర్మాలు కడుగుతారని, దాంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో అక్కడ మనుషులు వుండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో అనేక రోగాల బారిన పడుతున్నామన్నారు. కావున ఆ ఇండ్లకు రోడ్డు వేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుపైన పశువుల చర్మాలను కడుగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో పీవోడబ్లూ పట్టణ అధ్యక్షురాలు బి.నాగమణి, రెహన, ఏఐకేఏంఎస్‌ జిల్లా నాయకులు పడాల శంకర్‌, పట్టణ నాయకులు బి.సాయులు, ఐఎఫ్‌టీయూ నాయకులు కె.రవి, జి.రాజు, ఎస్‌.సాయులు, ముంతాజ్‌, అమీన బేగం స్థానికులు పాల్గొన్నారు.

Check Also

గత చరిత్ర చెప్పాల్సిన బాధ్యత ఉంది

బోధన్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బోధన్‌ 22 వార్డులో ...

Comment on the article