Breaking News

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చెక్కులు మంజూరు చేశారు.

ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన పోసానికి 18 వేల చెక్కు, చల్లగరిగ గ్రామానికి చెందిన గజానంద్‌కి 57 వేల చెక్కు, సిరికొండ మండలానికి చెందిన అభిషేక్‌కి 60 వేల చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను రక్షించడం జరుగుతుందని, అనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article