కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి 1-19 వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వైద్య అధికారులను ఆదేశించారు.
సోమవారం తన చాంబర్లో వైద్య అధికారులు, ఐసిడిఎస్, మున్సిపల్, విద్యాశాఖ, మెప్మా అధికారులతో వచ్చే అక్టోబరు 5 నుండి 12 వరకు నిర్వహించే 9 వ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యనిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిల్లలలో నులి పురుగుల వలన తీసుకున్న ఆహారం శరీరానికి అందదని, జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అనారోగ్యానికి గురువుతారని, తద్వారా పాఠశాలలకు గైరు హాజరవుతారన్నారు.
ఈ విషయాలను గ్రామ స్థాయిలో ఎఎన్ఎం, ఆశా, అంగన్ వాడీ, మెప్మా స్వయం సహాయక, ఐక్య మహిళా సంఘాల ద్వారా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గతంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఆల్బెండజోల్ అందించడం జరిగిందని, ప్రస్తుతం కోవిద్ -19 నిబంధనల మేరకు గ్రామాలలో, పట్టణాలలో ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని, దీనికి జిల్లా విద్యాశాఖ అధికారి గ్రామాలు, పట్టణ స్థాయిలో పాఠశాలల్లో చదివే పిల్లల వివరాలు ప్రాథమిక హెల్త్ సెంటర్లలో అందించాలని ఆదేశించారు.
మండల విద్యాధికారులు సంబంధిత పిహెచ్సి వైద్య సిబ్బందితో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పిల్లలందరికి మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా అనారోగ్యం, జ్వరం, కరోనాతో బాధపడుతున్నట్లయితే ఆల్బెండజోల్ మాత్రలు వేయవద్దని తగ్గిన తరువాత వారి ఇంటికి వెళ్లి మాత్రలు వేయాలని సూచించారు. కోవిద్ కారణంగా మాత్రలు వేసే సిబ్బంది భౌతిక దూరం పాటించేలా, శానిటైజేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు 1252 పాఠశాలలు, 62 ప్రభుత్వ, ప్రయివేటు బూనియర్ కాలేజీలు, 1193 అంగన్ వాడీ కేంద్రంలో 2,89,365 మంది 1-19 పిల్లలు వున్నారని, వీరందరికి ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ, మెప్మా స్వయం సహాయక, గ్రామ ఐక్య మహిళా సంఘాల ద్వారా ప్రతి ఒక్క 1-19 వయస్సు గల పిల్లలందరికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శోభారాణి, డాక్టర్ మోహన్ బాబు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిల్, జిల్లా పంచాయితీ అధికారి నరేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ దేవేందర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021