Breaking News

టియు పరిశోధకులకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలలో పిహెచ్‌.డి.చేసే పరిశోధక విద్యార్థులకు కొవిద్‌ -19 నిబంధనలు అనుసరించి డిజిటల్‌ వేదికగా ఆన్‌ లైన్‌ వైవా (మౌకిక పరీక్ష) లు నిర్వహించి డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయడం జరింగిందని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు సోమవారం తెలిపారు.

ఈ.వి.ఎల్‌. మాధురికి ఆగస్ట్‌ 21 న ఆచార్య డి.అశోక్‌ పర్యవేక్షణలో ఆర్గానిక్‌ కెమిస్ట్రిలో ”సింథెటిక్‌ స్టడీస్‌ ఆన్‌ న్యూ స్పిరొచ్రోమనోన్‌ అండ్‌ ఈజినల్‌ డెరివేటీవ్స్‌: థెయిర్‌ బయోలాజికల్‌ ఎవాల్యూషన్‌ అండ్‌ డాకింగ్‌ స్టడీస్‌” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్‌ ప్రదానం చేశారన్నారు. జి. సునీతకు ఆగస్ట్‌ 27 న డా. కె. సంపత్‌ కుమార్‌ పర్యవేక్షణలో అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ లో ”ఎ కంపారిటీవ్‌ అనాలిటికల్‌ స్టడీ అఫ్‌ గ్లోబల్‌ జిడిపి యూజింగ్‌ ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌ వర్క్‌ అండ్‌ ఫోర్‌ కాస్టింగ్‌ మెథడ్స్‌” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్‌ ప్రదానం చేశారన్నారు.

పి. హర్ష వర్ధని గౌడ్‌కి ఆగస్ట్‌ 28 న ఆచార్య ఎం. యాదగిరి పర్యవేక్షణలో ”వాలటిలిటీ ఇన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ చైనా – ఎ కంపాటీవ్‌ స్టడీ” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్‌ ప్రదానం చేశారన్నారు. చింతా ప్రవీణ్‌ కుమార్‌ ఆగస్ట్‌ 29 న ఆచార్య వి. శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఆంగ్లంలో ”రొమాంటిక్‌ రియలిజం: ఎ కంపారిటీవ్‌ స్టడి ఆఫ్‌ థ సెలెక్ట్‌ ఆఫ్‌ ఎఫ్‌ ఎం డాస్తోంస్కీ అండ్‌ కాంట్‌ జీ” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్‌ ప్రదానం చేశారన్నారు.

పి. శ్రీలతకు సెప్టెంబర్‌ 2 న డా.వి.రాజేశ్వరి పర్యవేక్షణలో బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో ”వర్కింగ్‌ ఆఫ్‌ ఫిషర్‌ మెన్‌ కో – ఆపరేటీవ్‌ సొసైటీ ఇన్‌ తెలంగాణ – ఎ స్టడీ ఆఫ్‌ వరంగల్‌ డిస్ట్రిక్‌” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్‌ ప్రదానం చేశారన్నారు. పిహెచ్‌.డి. డాక్టరేట్‌ సాధించిన పరిశోధక విద్యార్థులకు ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Check Also

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. ...

Comment on the article