Breaking News

మానవత్వం చాటుకున్న టౌన్‌ సిఐ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టౌన్‌ 4 పిఎస్‌ పరిధిలోని రోటరీ నగర్‌ కాలనికి సంబంధించిన గంగోని బాలమణి (65) ని తన కుమారుడు గత కొన్నిరోజుల నుండి వద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. కాగా కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో వధాశ్రమము నుండి ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ మధ్య నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడం వలన తిరిగి వద్ధాశ్రమానికి పంపగా కరోనా నేపథ్యంలో వృద్ధాశ్రమము మూసివేశారు.

కావున సాటివారు బాలమణిని వారి కుమారుని వద్దకు తీసుకుని వెళ్లగా అతను తన ఇంటిలో ఉంచుకోవడానికి నిరాకరించి ఇంటికి తాళం వేసి, తల్లిని అక్కడే వదిలేసి తన భార్య పిల్లలతో వూరికి వెళ్లి పోయారు. ఆమె చలికి వణికి పోతూ, వర్షానికి నానిపోతూ ఉంటె అట్టి సమాచారం నిజామాబాద్‌ నగర సిఐ బి.సత్యనారాయణ మరియు టౌన్‌ 4 ఎస్‌ఐ ఎమ్‌. లక్ష్మయకి తెలియగా వీరు స్వయంగా ఆ మాతమూర్తి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

తన కొడుకుతో సంరక్షణ కల్పించడానికి పూర్తి సహకారం అందిస్తామని, వద్దురాలును తన కొడుకు చూసుకునే విధంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తామని నచ్చజెప్పారు. వారి కుమారుని వివరాలు తెలుసుకొని ఫోన్‌లో మాట్లాడారు.

తల్లికి రక్షణ గా ఉండేవిధంగా కౌన్సెలింగ్‌ చేశారు. ఆ కుమారుడు హుటాహుటిన హైదరాబాద్‌ నుండి తన తల్లి వద్దకు ప్రస్తుతం వస్తున్నారు. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ – పోలీసును చాలా చక్కగా నిర్వహించారని చుట్టుపక్కల వారు హర్షం వ్యక్తం చేశారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article