Breaking News

ఒక వరద గేటు ఎత్తివేత

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్ట్‌ జలాశయం పూర్తి స్థాయిలో నిండి జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు 300 క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఒక వరద గేట్లను ఎత్తి దిగువ మంజీరాలోకి 50 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు.

కళ్యాణి ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను 409.50 మీటర్ల నీరు నిల్వ ఉంచుతూ జలాశయంలోని ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను 250 క్యూసెక్కుల వరద నీటిని నిజాంసాగర్‌ ప్రధాన కాలువలోకి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.

Check Also

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ ...

Comment on the article