Breaking News

కామారెడ్డిలో ఆధునిక మాంసం విక్రయ కేంద్రం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధునిక మాంసం విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ వి. లక్ష్మారెడ్డి అన్నారు. తాడ్వాయి మండలం దేవాయిపల్లిలో గొర్రెలకు, మేకలకు పిపిఆర్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పిపిఆర్‌ టీకాలు ఇస్తున్నామన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

గొర్రెల మార్కెట్‌ యార్డ్‌ కోసం రూపాయలు 30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా 80 శాతం రాయితీపై గొర్రెల కాపరులు షెడ్లు నిర్మించుకోవాలని సూచించారు. పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. మొదటి విడతలో 40 మందికి గొర్రెల కాపరులకు ప్రభుత్వం రాయితీ గోర్లు అందజేసిందని చెప్పారు. రెండో విడతలో గొర్రెల పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ మాట్లాడుతూ వంద శాతం గొర్రెలకు పిపిఆర్‌ టీకాలు వేయించుకోవాలని, గొర్రెల కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. జిల్లా పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి జగన్నాథ చారి, జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం అధ్యక్షుడు మరికంటి భూమయ్య, పశు వైద్య అధికారులు రామచంద్రం, దేవేందర్‌, రామ్‌ రెడ్డి, గొర్రెల కాపరులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article