Breaking News

శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 13 వ డివిజన్‌లో గల సాయిరాం సర్వ సంఘం స్మశాన వాటిక స్థలాన్ని డివిజన్‌ ఎంఐఎం కార్పొరేటర్‌, అతని అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంపై బీజేపీ నగర మాజీ అధ్యక్షులు యెండల సుధాకర్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో న్యాయ పరంగా ఈ భూమిని సర్వే చేసి హద్దులతో సహా కేటాయించి కాలనీ సభ్యులకు ప్లాన్‌ మరియు డాక్యుమెంట్‌లు అందించడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఎంఐఎం కార్పొరేటర్‌ మరియు అనుచరులు స్మశాన వాటిక స్థలంలో సంఘ సభ్యులపై దాడి చేసి స్థలంలో బోర్డులు పాతి అడ్డొచ్చిన వారిని బెదిరించి భయబ్రాంతులకు గురిచేయ్యటం బోర్డులు పాతడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అట్లాగే నగరంలో ఇటువంటి కబ్జాదారులపై అధికారులు కఠిన శిక్షలు అమలు చేయాలని కలెక్టర్‌ను కోరారు. వెంటనే వారు తగు రీతిలో స్పందించి తగు చర్యలకై హామీ ఇచ్చారన్నారు.

అట్లాగే ఎంఐఎం, అధికార తెరాస ఆగడాలను అరికట్టాలని, నగర శివార్లలో పేదప్రజల పట్టాలని సైతం కబ్జాలతో నిత్యం పరిపాటిగా మారినందున ఇకనైనా ప్రవర్తన మార్చుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనకార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు స్వామి యాదవ్‌, నారాయణ యాదవ్‌, నాగరాజు, శంకర్‌, రాజేష్‌ మరియు సంఘం అధ్యక్షులు నర్సింహులు, మురళి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article