Breaking News

సింగూరు గలగల

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టిఎంసిలుకాగా ఈ నెల 11 వరకు ఉన్న నీరు 3.5 టీఎంసీలే సోమవారంతో ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 18.070 పది రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున వరద ప్రవాహం నమోదైంది.

ఈ నెల 12 నుంచి వందల క్యూసెక్కుల ప్రవాహం తో ప్రారంభమైన 18 న 52,384 క్యూసెక్కుల వరకు నమోదైంది. అనంతరం క్రమేణా తగ్గు ముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 13,823 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి నీరు చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా (29.917 టీఎంసీలకు) గాను ప్రస్తుతం 520.960 మీటర్ల (18.070 టీఎంసీల) నీరు నిల్వ ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

Check Also

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ ...

Comment on the article