నిజామాబాద్, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 10 వ రౌండ్ దివార్మింగ్ డే సందర్బంగా అక్టోబరు 5 నుండి 12 వరకు ప్రతి ఒక్క పిల్లవాడికి అల్బెన్దజోల్ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు.
సోమవారం జిల్లాలోని వైద్య, విద్య తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు అంగన్వాడి, ఇంటర్మీడియట్ అధికారులు ఆన్లైన్ తరగతులు జరుగుతున్నవి కాబట్టి పిల్లలకూ వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, కోవిడ్ ఉన్నందున ఇంటిదగ్గరకే అంగన్వాడి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వచ్చి మాత్రలు వేస్తారన్న విషయం తెలియచేస్తూ సహకరించాలని కోరాలన్నారు.
మనమే పిల్లల దెగ్గరికి వెళ్ళాలి కాబట్టి డిఇవో, డిఐఇవో, డిడబ్ల్యువోతో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క టీచర్, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు కలిసి పని చేసినప్పుడే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కోర్దినేషన్తో పని చేయాలని, ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021