Breaking News

గ్రామాభివద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ అభివద్ధికి ఎల్లప్పుడు కషి చేస్తా అని సర్పంచ్‌ ఎర్రోళ్ల బాలయ్య అన్నారు. నిజాంసాగర్‌ మండలం బ్రహ్మణ్‌ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప్ప సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాలకవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు.

అనంతరం పంచాయతీ కార్యదర్శి గంగారాం ఆదాయ వ్యయాల గురించి చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలో ఎప్పటికప్పుడు మురికి కాలువలు శుభ్రం చేయడం, ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడడం, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్‌ గర బోయిన వెంకటేశం, వార్డు సభ్యులు తదితరులున్నారు.

Check Also

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ ...

Comment on the article