Breaking News

అభివృద్ది పనులు ప్రారంభం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌, కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుమారి నిట్టు జాహ్నవి మరియు నిట్టు వేణుగోపాల్‌ రావు సహకారంతో మంగళవారం దేవునిపల్లి కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్‌ కాసర్ల గోదావరీ స్వామి ఆధ్వర్యంలో ఎస్‌సి కాలనీలో ఎస్‌సిఎస్‌పి (ఎస్‌ఎఫ్‌సి) నిధులలో భాగంగా 20 లక్షల రూపాయలతో సిసి డ్రైనేజీ మరియు మురుగు నీటి కల్వర్టులను ప్రారంభించారు.

కార్యక్రమంలో భాగంగా 35వ వార్డు కౌన్సిలర్‌ పోలీసు క్రిష్ణాజీరావు మరియు మాజీ సర్పంచ్‌ నిట్టు వెంకట్‌రావు, కాసర్ల రవీందర్‌, నిట్టు శంకర్‌రావు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Check Also

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం రామారెడ్డి శివారు గొల్లపల్లి గేట్‌ సమీపంలో ...

Comment on the article