Breaking News

ఫోన్‌ చేయండి… పని కల్పిస్తాం..

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనుల కోసం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో ఉపాధి హామీ పనుల కోసం మండల స్థాయిలో, గ్రామస్థాయిలో పని అవసరమైనట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ నెంబర్‌లో 08462 229797 కు ఫోన్‌ చేసినట్లయితే పని కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు.

కాల్‌ సెంటర్‌ బుధవారం నుండి వినియోగంలోకి వస్తుందని, ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల లోపు ఫోన్‌ చేసినట్లయితే పని కల్పించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఏవైనా డబ్బు చెల్లింపు సమస్యలున్నా పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వివరించారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article