Breaking News

వరి పంటపై చీడల ఉధృతి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వెల్గనూర్‌ గ్రామ శివారులో సాగవుతున్న వరి పంటలను ఏవో అమర్‌ ప్రసాద్‌ పరిశీలించారు. అనంతరం ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. వరి పంటపై ఉల్లికోడు, మొగిపురుగు, సుడి దోమ వంటి చీడల ఉధతి గమనించినట్టు చెప్పారు.

వాటి నివారణ కోసం ఉల్లికోడు కార్ఫో సల్ఫైన్‌ 250 మిల్లీలీటర్లు, మొగి పురుగు, కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 400 గ్రాములు, సుడి దోమ బుప్రోఫెజిన్‌ 320 మిల్లీలీటర్లు లేదా డైనోటెఫ్యూరాన్‌ 80 మిల్లీ లీటర్లు మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చెయ్యాలని రైతులకు సూచించారు.

ఏవో వెంట ఏఈ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, అచ్చంపేట్‌ సొసైటీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌ కుమార్‌, వీఆర్వో రైతులు తదితరులు ఉన్నారు.

Check Also

బీమా కల్పించి ఉంటే అండగా ఉండేది…

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కామారెడ్డి ...

Comment on the article