Breaking News

కోవిడ్‌ నిబంధనల నడుమ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్‌) కోర్సులకు చెందిన చివరి (ఆరవ) సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం కొవిద్‌ – 19 నిబంధలు, మార్గనిర్దేశకాలను అనుసరించి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలను రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 7481 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7112 మంది హాజరు, 369 గైరాజరు అయినట్లు వివరించారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన మొదటి సెమిస్టర్‌ (2016 – 2017 బ్యాచ్‌ విద్యార్థులకు మాత్రమే) బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 83 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 79 హాజరు, 4 గైర్హాజరు అయినట్లు తెలిపారు.

విద్యార్థుల సౌలభ్యం కోసం మొత్తం 57 సెల్ఫ్‌ పరీక్షా కేంద్రాలను, 11 సమాధాన పత్రాల చేరవేత రూటులను ఏర్పరిచామని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలలో భౌతిక దూరం పాటించే విధంగా తగు చర్యలు తీసుకొన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరిని థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించామని చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించారని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాలను శానిటైజేషన్‌ చేశారని పేర్కొన్నారు.

Check Also

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. ...

Comment on the article