Breaking News

హెడాఫీస్‌ ముందు ధర్నా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెలిపొన్‌ బీడీ కంపనీలో బీడీలు చేసే కార్మికులకు కంపనీ వారు ఇస్తున్న ఆకు పలుగుడు, ముక్కుడు, దొడ్డు, నల్లగా, కలర్‌, ఖరాబు వున్నందున వేయి బీడీల ఆకులో కేవలం ఐదు వందల బీడీలు మాత్రమే అవుతున్నాయని, తక్కువ పడిన బీడీల కోసం కార్మికులు వారి సొంత డబ్బులతో ఆకు కొని భర్తీ చేస్తున్నారని, దీని మూలంగా ఆర్థికంగా నష్ట పోతున్నారని, నెలకు 10,12 దినముల పని, రోజుకు 5,6 వందల బీడీలకు మాత్రమే పని కల్పిస్తూ న్నారని ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని ముభారక్‌ నగర్‌ హెడ్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా చేపట్టారు.

కార్మికులు ”వేయి బీడీలకు సరిపడా మంచి తునికాకు-ఇవ్వాలని, ”రోజు వేయి బీడీల చొప్పున, నెలకు 26 దినముల పని ఇవ్వాలని, ”కొత్తగా ఇస్తున్న పీఎఫ్‌ నెంబర్లకు ఇబ్బందులకు -గురి చేయొద్దని, ”కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో కంపని మొండి వైఖరీ-నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఎం.నరేందర్‌ మాట్లాడుతూ బీడీ మరియు చుట్టా కార్మికుల చట్ట ప్రకారం, 1999 ఫిబ్రవరి 4న కంపని యాజమాన్యాలకు యూనియన్‌ ప్రతినిధులతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆకు ఖరాబు తెలిపిన 3 రొజులలో కత్తిరించి, వచ్చిన యావరేజ్‌ ప్రకారం ఇవ్వాలని కానీ కంపని వారు అలా ఇవ్వకుండా కార్మికులను దోపిడీ చేస్తున్నారని మండి పడ్డారు.

అదే విధంగా వారంలో 3 రోజులు, రోజుకు 5,6 వందల బీడీలకు మాత్రమే పని ఇవ్వడంతో కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారని, రాజీనామా చేసిన తరువాత గ్రాట్యుయిటి (సర్వీస్‌) లెక్క కట్టేటప్పుడు అటెండెన్స్‌ లేక, పని లేక సర్వీస్‌ డబ్బులు తక్కువ వచ్చి నష్ట పోతున్నారని, కావున చట్ట ప్రకారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదే కాక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి ఆఫీసుకు వెళ్లిన యూనియన్‌ నాయకులను రానివ్వడం లేదని ఇది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైన కార్మికుల సమస్యలను చర్చించి పరిష్కరించాలని, లెనియెడల కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష / కార్యదర్శులు డి.రాజేశ్వర్‌, ఎం.వైంకటి, సహాయ కార్యదర్శి బి.మల్లేష్‌, ట్రెజరర్‌ డి.కిషన్‌, జిల్లా నాయకులు రావుట్ల రమేష్‌, జిల్లా పరిధిలోని అన్ని సెంటర్ల కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article