Breaking News

భారీగా గుట్కా స్వాధీనం, నిందితుల అరెస్టు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 2వ టౌన్‌ పరిధిలో భారీ మొత్తంలో గుట్కా పట్టుకుని, నిందితులను అరెస్టు చేసినట్టు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందన్నారు.

మంగళవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ షాకేర్‌ అలీ, వారి సిబ్బంది నిజామాబాద్‌ 2వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కొందరు వ్యక్తుల ఇంట్లో ప్రభుత్వ నిషేదిత గుట్కా ఉందని, విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. కాగా సుమారు 6 లక్షల విలువ చేసే గుట్కాలను పట్టుకోవడం జరిగిందని టాస్క్‌ ఫోర్స్‌ సీఐ షాకేర్‌ అలీ వివరించారు.

పట్టుబడిన నిందితుల వివరాలు

1) నిసార్‌, బర్కత్‌పుర కాలనీ, నిజామాబాద్‌

2) అల్మాస్‌, బర్కత్‌ పుర కాలనీ, నిజామాబాద్‌

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article