Breaking News

25 లోగా పూర్తి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ పంచాయితీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం టెలి కాన్ఫరెన్సు ద్వారా ఆర్‌ఓలు, పంచాయితీరాజ్‌ ఇఇ డిఇ, ఎఇలతో రైతు వేదికల నిర్మాణ పనులను సమీక్షించారు.

జిల్లాలో 104 క్లస్టర్లలో రైతు వేదిక భవనాలు పూర్తి కావడం జరిగిందని, మిగిలిన 71 రైతు వేదిక భవన నిర్మాణాలు ఈ నెల 25 లోగా పనులు పూర్తి చేసుకోవాలని, అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఏజెన్సీలో పేమెంట్‌ నిలిపివేయడం జరుగుతుందని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, డిఇ, ఎఇలు, ఏజెన్సీ నిర్వాహకులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతు వేదిన భవనాల చట్టూ పెద్ద మొక్కలు పచ్చదనం ఏర్పాటు చేయాలని తెలిపారు. పనులకు సంబంధించి ఎఫ్‌ఓ జనరల్‌ చేయాలని తెలిపారు. పూర్తి కాబడిన రైతు వేదికలతో ఫోటో ఆల్బమ్‌ సమర్పించాలని తెలిపారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article