Breaking News

పెరుగుతున్న నీటిమట్టం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌, సింగూరు ప్రాజెక్ట్‌ల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సింగూరు ప్రాజెక్ట్‌లో భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా పోచారం, హెల్ది వాగుల ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇన్‌ ఫ్లో వచ్చి చేరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 1405. అడుగులకు గాను 1393.25 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 5.699 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎగువ ప్రాంతం నుంచి 3966 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల గాను, 521.240 మీటర్ల నీటి మట్టం, అలాగే 29.917 టీఎంసీలకు గాను 19.043 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో 8268 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌ లోకి వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో మరిన్ని భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్‌ త్వరలోనే పూర్తి స్థాయిలో నిండే అవకాశముందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సింగీతం ప్రాజెక్ట్‌ పెద్దగుట్ట, గండివేట్‌, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 663 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుందని, వస్తున్న వరద నీటిని ప్రధాన కాలువలోకి మళ్ళించడం జరుగుతుందని తెలిపారు.

సింగీతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 మీటర్ల నీరు ఉందన్నారు. కళ్యాణి ప్రాజెక్ట్‌ 409.00 మీటర్ల గాను 408.70 మీటర్ల నీరు నిల్వ ఉంచుతూ, కురుస్తున్న వర్షానికి 415 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని 1 గేటు ద్వారా 165 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిజాంసాగర్‌ ప్రధాన కాలు వైపు మళ్ళించడం జరుగుతుందన్నారు. ప్రధాన కాలువ వైపు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో కాలువవైపు ప్రజలు ఎవరూ కూడా వెళ్ళకూడదన్నారు.

Check Also

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ ...

Comment on the article