కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి, భూంపల్లి గ్రామ శివారులోని అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే సర్పంచ్, కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భూంపల్లిలోని అంబరీషుని గుట్టపై ఉన్న పల్లె ప్రకతి వనాన్ని సందర్శించారు. నాటిన మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంకీ ఫుడ్ కోర్టులో నేరేడు, ఉసిరి, చింత, మర్రి, రావి, సీతాఫలం, దానిమ్మ, జామ వంటిమొక్కలు దగ్గర దగ్గరగా నాటాలని పేర్కొన్నారు. మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలని కోరారు. ఉపాధి హామీ పథకం కూలీలను ఏర్పాటు చేసి మొక్కలకు నీటిని అందించాలని చెప్పారు.
అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడవలసిన బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా ప్రజల సహకారంతో తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు కవిత, పద్మాజివాడి, లలితా బాయ్, భూంపల్లి, డిపిఓ నరేష్ కుమార్, డిఎల్పిఓ హరి సింగ్, ఎంపీడీవో అశోక్, ఎంపిఓ సవిత, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021