Breaking News

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌, రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు, స్ట్రీట్‌ వెండర్స్‌, నర్సరీలు, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. బుధవారం ఆర్డిఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా, డిపిఓ, పిఆర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్‌ పర్‌ఫెక్టుగా ప్లాన్‌ చేయాలని, ప్రతి రైస్‌ మిల్‌ దగ్గర్నుండి రోజుకు రెండు ఏసికె (29 ఎంటిఎస్‌) ల రైస్‌ బయటికి వెళ్లాలని, అలా అయితేనే మనం టార్గెట్‌ రీచ్‌ అవుతామన్నారు.

ప్రతిరోజు పని చేయించాలని, రైస్‌ మిల్లు దగ్గర నుండి ఎఫ్‌సిఐ దగ్గర ఉన్న ఇషూస్‌ పరిష్కారం చేయాలని, ఆర్డీవోలు, తహశీల్దార్లు వెళ్లి చూడాలని, సెప్టెంబర్‌ 25 నుండి ప్రతి రైస్‌ మిల్లు దగ్గర నుండి 2 ఏసికె వెళ్లాలని, సెలవు రోజులు కూడా పనిచేయాలన్నారు. రైతు వేదికల పనులు మన జిల్లాలో మంచిగా చేస్తున్నారని, ఇంకా స్పీడ్‌ చేయాలని, ఆర్మూర్‌లో కొంత ఆలస్యం జరుగుతున్నదని, బేస్మెంట్‌, లేంటిల్‌, రూప్‌ లెవెల్‌ కింద ఉన్న వారిని వేగిర పరచాలని, పల్లె ప్రకతి వనాలు ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి ఉండాలని, వీధి విక్రయ దారుల ఐడెంటిఫికేషన్‌ 100 శాతం పూర్తి చేయాలన్నారు.

ఐడెంటిఫికేషన్‌ కొరకు, అప్‌లోడ్‌కు ఒకొక్క టీం ఏర్పాటు చేసుకొని రేపు సాయంత్రానికి అప్‌లోడ్‌ పూర్తి కావాలన్నారు. నర్సరీలు వచ్చే సంవత్సరం కొరకు ప్లాన్‌ చేయాలన్నారు. డిఫరెంట్‌ లొకేషన్‌లో మున్సిపాలిటీలు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌లలో సెప్టెంబర్‌ 30 వరకు నర్సరీ ప్రిపరేషన్‌ ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేయడం బ్యాగ్స్‌, సీడ్‌ కలెక్షన్‌, సాయిల్‌ ఏడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పశువులు మేయని మొక్కల సీడ్స్‌ సేకరించాలన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఒక్కో ఏరియాకు ఒక పర్సన్‌ను పెట్టాలని ఎక్కడ ఇల్లీగల్‌ లేఅవుట్లు, ఇల్లీగల్‌ ప్లాట్లున్న గుర్తించాలని, వారితో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయించడం, వార్డు వారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్టర్‌ మెయింటైన్‌ చేయాలని, అడ్రస్‌లు తీసుకొని ఫాలో చేయాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ పై పర్‌ఫెక్టు ప్లాన్‌తో వెళ్తే సక్సెస్‌ కాగలుగుతామని, హరితహారం ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వాలని, గ్రామాలలో రోడ్‌ సైడ్‌ మొక్కలు 10 నుండి 14 ఫీట్లు ఉండే విధంగా కొని ప్లాంటేషన్‌ చేయాలని, నర్సరీలో ఖాళీ లేకుంటే, గ్రామాలలో ఖాళీ స్థలాలలో రోడ్‌ సైడ్‌ ప్లాంటేషన్‌ చేయాలన్నారు. మున్సిపాలిటీలలో కూడా పెద్ద మొక్కలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు లత, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article