కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్ఎస్ఎఫ్, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దోస్తు అడ్మిషన్ల ప్రక్రియలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వాటికి అనుబంధంగా ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలలోని విద్యార్థులను వారికి తెలియకుండానే వారి ఫోన్ నెంబర్లు బదులు అధ్యాపకులు మరియు ఇతరుల ఫోన్ నెంబర్లతో అడ్మిషన్లను భర్తీ చేయడం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని కొన్ని కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం జరుగుతుందని విద్యార్థుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారికి తెలియకుండానే వారి అడ్మిషన్లను దోస్తులో నమోదు చేయడం జరుగుతుందన్నారు. కొన్ని డిగ్రీ కళాశాలలు కేవలం అడ్మిషన్లు నింపుకోవడానికి తప్పా ఆ కళాశాలలో తరగతులు నిర్వహించడం లేదని ఆ కళాశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు వేరే కళాశాలలో తరగతులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కేవలం యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఆ కళాశాలలు ఉన్నట్లుగా చూపించడం జరుగుతుందని ఆ తర్వాత అందులో ఎటువంటి తరగతులు నిర్వహించడం లేదని, దోస్తు అడ్మిషన్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన కళాశాలల ప్రిన్సిపాల్, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమాలపై విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కమిషనర్ మరియు దోస్త్ కన్వీనర్కి ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, సతీష్, పవన్, నవీన్ తదితరులున్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021