Breaking News

మందుల చట్టం నిబంధనలు పాటించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీలత ఔషద దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కోవిడ్‌ మందులు, యాంటి బయోటెక్స్‌, ఇతర మందుల ఎంఆర్‌పి ధరలు, నిలువ, నాణ్యత పరిశీలించారు.

అదేవిధంగా అమ్మకం, కొనుగోలు బిల్లులు పరిశీలించారు. ప్రతి మెడికల్‌ షాపు మందుల చట్టం నిబందనలు పాటించాలని, ఎక్స్‌ పయిరి మందులు ఎప్పటికప్పుడు తొలగించాలని, కస్టమర్లకు తప్పనిసరిగా కొనుగోలు బిల్లులు ఇవ్వాలన్నారు. షెడ్యూలు రిజిస్టర్‌ తప్పకుండా రాయాలని, వైద్యుని చీటి మేరకు ఫార్మాసిస్టు మందులు అమ్మాలని సూచించారు.

ఆర్‌ఎంపి, పిఎంపిలు తమ దగ్గర మందులు ఉంచుకోకూడదని, హోల్‌సేల్‌ మెడికల్‌ ఏజెన్సీల వారు డ్రగ్‌ లైసెన్సు ఉన్న మందుల షాపులకు మాత్రమే మందులు అమ్మాలని ఏడి హెచ్చరించారు. ఎలాంటి ఔషద ఫిర్యాదుల కోసమైనా 8333925852 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article