Breaking News

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు హరిత హారంలో నాటిన ఏవిన్యూ ప్లాంటేషన్‌ పరిశీలించగా రైతుల నిర్లక్ష్యం వల్ల మొక్కలపై మొక్కజొన్న బూరు వేయడం వల్ల చనిపోయాయని పరిశీలనలో తెలిసిందని, ఒక్కొక్క మొక్కకు వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించడం జరిగిందని, మొత్తం ఐదు మొక్కలు చనిపోగా, సంబంధిత ఐదుగురు రైతులకు 5 వేలు జరిమానా విధించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఈ విధంగా మొక్కలకు హాని కలిగించినట్లయితే మొక్కకు ఐదు వేల చొప్పున జరిమానా విధించి చట్టప్రకారం వారిపై కేసు నమోదు చేయబడునని వారికి తెలియజేయమని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

పరిశీలన కార్యక్రమంలో ముప్కాల్‌ మండల ఎంపీడీవో దామోదర్‌, తహసిల్దార్‌ జయంత్‌ రెడ్డి, ఏఎస్‌ఐ రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article