Breaking News

ఉచిత ఆరోగ్య రక్షణ కల్పించాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ కార్మిక సంఘాలు బుధవారం దేశ వ్యాప్తంగా అఖిల భారత నిరసన దినాన్ని జరుపాలని ఇచ్చిన పిలుపులో భాగంగా బోధన్‌ ఆర్డీవో కార్యాలయం ముందు ఐఎఫ్‌టియు, ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌, సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు జే.శంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా అందరికీ ఉచిత ఆరోగ్య రక్షణ కల్పించాలని, దేశంలోని ప్రజలందరికీ 6 నెలల పాటు నెలకు 10 కిలోల చొప్పున ఆహార సరుకులను ఉచితంగా పంపిణి చేయాలని, పన్ను చెల్లింపు పరిధిలో లేని కుటుంభాలకు నెలకు 7 వేల 500 రూపాయల నగదు 6 నెలల పాటు చెల్లించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద క్రింద 200ల రోజులు పని కల్పించి, రోజు కు 600ల వేతనం ఇవ్వాలని, లేదా ఉద్యోగ భతి చెల్లించాలని, పట్టణ ఉద్యోగ భద్రత చట్టం చేసి అమలు చేయాలని తదితర 34 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో పీవోడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, బీపాషా బేగం, రెహన, తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షురాలు కె.లక్ష్మీభాయి, ఏఐకేఏంఎస్‌ జిల్లా నాయకులు పడాల శంకర్‌, శీలం సురేష్‌, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

గత చరిత్ర చెప్పాల్సిన బాధ్యత ఉంది

బోధన్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బోధన్‌ 22 వార్డులో ...

Comment on the article