Breaking News

ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ బిల్లును వెంటనే రద్దు చేయాలని, ప్రజలకు పేద మధ్య తరగతి కుటుంబాలకు నడ్డివిరిచే విధంగా ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుమీద వేల కోట్ల రూపాయలు దండుకున్నారని బిజెపి నాయకులు పుప్పాల శివరాజ్‌ కుమార్‌ జీవి నరసింహా రెడ్డి దుయ్యబట్టారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి ఎల్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూర్చాలని కోరారు. లేనిచో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మంగళవారం జరిగిన ధర్నా కార్యక్రమంలో పోలీసులు అమానుషంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌, ఆర్మూర్‌ ఫ్లోర్‌ లీడర్‌ జీవి నరసింహారెడ్డి, అలాగే 35 వ వార్డు కౌన్సిలర్‌ ఆకుల శ్రీనివాస్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఉదయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దళితుల‌ అణిచివేతపై నిరసన గళం

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ...

Comment on the article