Breaking News

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అధికంగా పోషకాలున్న ఆహార పదార్థాలను అందంగా అలంకరించి అవగాహన కల్పించారు.

అనంతరం సర్పంచ్‌ లింగాల వసంత మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌ వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తుందన్నారు. గర్భిణీలు, బాలింతలు చిన్నారులు తప్పక పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని, అలాగే చిన్నారుల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్‌ వాడి టీచరర్‌ పార్వతి, తదితరులు ఉన్నారు.

Check Also

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ ...

Comment on the article