Breaking News

ప్రథమ చికిత్సాలయం ప్రారంభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం యోగి ప్రథమ చికిత్సలయాన్ని దర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ ప్రారంభించారు.. ముందుగా డాక్టర్‌ యుగేందర్‌కి శుభాకాంక్షలు తెలియజేసి, ఆసుపత్రి మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. మండల కేంద్ర ప్రజలందరికీ ఆరోగ్యపరంగా సేవలు అందించాలని సూచించారు.

కార్యక్రమంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, స్థానిక ఎంపీపీ నల్ల సారిక హనుమంత్‌ రెడ్డి, ఎంపీటీసీ సుజా ఉద్దీన్‌, ధర్పల్లి గ్రామ ఉపసర్పంచ్‌ భారతీ రాణి, పిఎసిఎస్‌ సొసైటీ చైర్మన్‌ చిన్నారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పీసు రాజ్‌ పాల్‌ రెడ్డి, గ్రామ అభివద్ధి కమిటీ చైర్మన్‌ రంజిత్‌, సీతాయి పేట్‌ సర్పంచ్‌ విజయ రాములు, దుబ్బాక సర్పంచ్‌ వెంకటేష్‌, కో ఆప్షన్‌ నెంబర్‌ అబ్దుల్‌ మజీద్‌, నాయకులు సుభాష్‌, గాదారి మనోహర్‌ రెడ్డి, సురేందర్‌ గౌడ్‌, కిషోర్‌ రెడ్డి, నజీర్‌, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comment on the article