నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్రజొన్న విత్తనాలు ఏ డీలర్ వద్ద రైతు కొనుగోలు చేసాడో ఆ డీలరే ఎర్ర జొన్నలు కొనుగోలు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్‌లలో 18 మండలాలలో సుమారు 150 గ్రామాలలోని సుమారు 30 నుండి 45 వేల ఎకరాలలో ఎర్ర జొన్న సాగు చేయుట జరుగుతున్నదని, గత సంవత్సరం ...
Read More »Daily Archives: September 24, 2020
నడక దారి ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్బన్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అర్బన్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మ్యాప్ చూశారు. పార్కు లో నడక దారి ఏర్పాటు చేయాలని సూచించారు. మియావాకీ విధానంలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ ...
Read More »ఆన్లైన్ తరగుతలపై అవగాహన
నిజాంసాగర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్ లైన్ తరగతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోషి కిషోర్ అన్నారు. పెద్ద కొడపగల్ మండలంలోని పోచారం తండాలో విద్యార్థులకు టి సాట్ ఆప్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ ఆన్ లైన్ క్లాస్‌లు విని నోటుబుక్‌లో రాసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆన్ లైన్ క్లాస్‌లను శ్రద్ధగా వినాలన్నారు. విద్యార్థులందరూ ఆన్లైన్ క్లాసులకు హాజరు కావాలని కోరారు.
Read More »తడి, పొడి చెత్తతో ఎరువుల తయారీ
నిజాంసాగర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని కంపోస్టు షెడ్లో ఎరువుల తయారీ కోసం మట్టి కొబ్బరి టిచ్చు, మురిగిన చెత్త, వాన పాములను (నట్టలు)లు వేయడం జరిగిందని ఎంపీడీవో తోట పర్బన్న అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపోస్ట్ షెడ్లో మురిగిన ఆకులు, కూరగాయలు, తదితర రకాల తడి పొడి చెత్త వేయడంతో 45 రోజుల తరువాత ఎరువుగా తయారవుతుందన్నారు. ఎరువుగా తయారైన తరువాత బస్తాలల్లో నింపి చెట్లకు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో అబ్బాగౌడ్, ...
Read More »టీయూలో 51 వ జాతీయ సేవా పథకం దినోత్సవం
డిచ్పల్లి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 51 వ జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో టీయూ క్యాంటీన్ పరిసర ప్రదేశంలో ”హరితహారం” నిర్వహించారు. కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఆచార్య నసీం ముఖ్యఅతిథిగా విచ్చేసి మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 51 వ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) దినోత్సవంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి మూడు మొక్కలు ...
Read More »27న ప్రవేశ పరీక్ష
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో చేరుటకు ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతుందని రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. గురువారం తేదీ 24 నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేయనివారు ఎలాంటి విద్యార్హత లేకుండా ...
Read More »