Breaking News

నడక దారి ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటుకు స్థలాన్ని గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మ్యాప్‌ చూశారు. పార్కు లో నడక దారి ఏర్పాటు చేయాలని సూచించారు. మియావాకీ విధానంలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందూ ప్రియ, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, తహసీల్దార్‌ అమీన్‌ సింగ్‌, ఉద్యానవన, అటవీశాఖ, మున్సిపల్‌ శాఖ అధికారులు, రాశివనం ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article